శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ నారాయణన్.. LMV-3 ప్రయోగం సక్సెస్ కావాలని ప్రార్థనలు
తిరుమల, 22 డిసెంబర్ (హి.స.) భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ వి.నారాయణన్, శాస్త్రవేత్తల బృందం ఇవాళ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈనెల 24న జరగనున్న ఎల్‌వీఎం-3 (Launch Vehicle Mark-3) ప్రయోగం విజయవంతం కావాలని శ్రీ
తిరుమల


తిరుమల, 22 డిసెంబర్ (హి.స.)

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ వి.నారాయణన్, శాస్త్రవేత్తల బృందం ఇవాళ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈనెల 24న జరగనున్న ఎల్‌వీఎం-3 (Launch Vehicle Mark-3) ప్రయోగం విజయవంతం కావాలని శ్రీవారికి ప్రత్యేక పూజలకు చేశారు. ఈ మిషన్‌లో అమెరికాకు చెందిన ఏఎస్‌టీ స్పేస్‌మొబైల్ కంపెనీకి చెందిన బ్లూబర్డ్ బ్లాక్-2 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా ఉపగ్రహ నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అయితే, ఇస్రో చరిత్రలోనే ఇది ఒక బాహుబలి మిషన్‌గా పేరొందిందని, ఈ ప్రయోగం చరిత్రాత్మకమైనదని ఇస్రో చైర్మన్ నారాయణన్ అన్నారు. బ్లూబర్డ్ బ్లాక్-2 (Bluebird Black-2) ఉపగ్రహం ప్రపంచవ్యాప్తంగా సాధారణ స్మార్ట్‌ఫోన్‌లకు నేరుగా హై-స్పీడ్ సెల్యులర్ బ్రాడ్‌బ్యాండ్ (High-Speed Cellular Broadband) సేవలు అందించే సామర్థ్యం ఈ ఉపగ్రహం కలిగి ఉందన్నారు. ఇక లో ఎర్త్ ఆర్బిట్‌లో అతి పెద్ద కమర్షియల్ కమ్యూనికేషన్ ఉపగ్రహంగా ఎల్‌వీఎం-3 రికార్డు సృష్టించనుంది. ఈ మిషన్ ఇస్రోకు మరో మైలురాయిగా నిలుస్తుందని, భారత్ ప్రపంచ స్థాయి కమర్షియల్ లాంచ్ సేవల్లో ముందంజలో ఉందని ఇస్రో చైర్మన్ నాయరణ్ అభిప్రాయపడుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande