
కామారెడ్డి, 22 డిసెంబర్ (హి.స.) ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలోని
గ్రామాల్లో సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన నూతన సర్పంచ్లకు, ఉపసర్పంచ్లకు, వార్డు సభ్యులకు ఎమ్మెల్యే మదన్మోహన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నూతన ప్రజాప్రతినిధులు అంకితభావంతో పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు స్వచ్ఛమైన, పారదర్శకమైన అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యంగా అడుగులు వేయాలని కోరారు. గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి అందరూ సమన్వయంతో ముందుకు సాగాలని, ఈ ప్రయాణంలో నియోజకవర్గ ఎమ్మెల్యేగా తాను ఎల్లప్పుడూ తోడుంటానని హామీ ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు