
హైదరాబాద్, 22 డిసెంబర్ (హి.స.)
నియోజకవర్గ కేంద్రమైన పటాన్ చెరు పట్టణంలో ఆధునిక వసతులతో అత్యధిక సౌకర్యాలతో సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయాన్ని నిర్మించబోతున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్ చెరు డివిజన్ పరిధిలోని ఎక్సైజ్ ఆఫీస్ సమీపంలో 12 కోట్ల రూపాయల సీఎస్ఆర్ నిధులతో 44010 చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతనంగా నిర్మించ తలపెట్టిన డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయం భవన నిర్మాణ పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా భవిష్యత్తు అవసరాలకు కొరకు ఆధునిక వసతులతో, విశాలమైన గదులతో 44 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సెల్లార్, జిప్లస్ టు అంతస్తులతో కార్యాలయాన్ని నిర్మించబోతున్నట్లు చెప్పారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..