
హైదరాబాద్, 22 డిసెంబర్ (హి.స.)
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొంది నేడు పదవి బాధ్యతలు చేపట్టిన నూతన సర్పంచులు, వార్డు సభ్యులకు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజల నమ్మకంతో ఎన్నికైన ప్రజాప్రతినిధులు గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమం, పారదర్శక పాలన దిశగా బాధ్యతాయుతంగా పనిచేయాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు.
గ్రామాలే రాష్ట్ర అభివృద్ధికి పునాది అని పేర్కొన్న మంత్రి..సర్పంచులు వార్డు సభ్యులు సమిష్టిగా పనిచేస్తేనే పల్లె ప్రగతి సాధ్యమవుతుందనీ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కార మార్గాలు చూపే నాయకత్వం అందించాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరిస్తుందని, ప్రజాప్రతినిధులు ధైర్యంగా ముందుకు సాగాలని మంత్రి సీతక్క భరోసా ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..