కేసీఆర్, హరీశ్రావు బరితెగించి మాట్లాడుతున్నారు.. ఉత్తమ్ సీరియస్
హైదరాబాద్, 22 డిసెంబర్ (హి.స.) బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, ఆ పార్టీ మాజీ మంత్రి హరీశ్ రావుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. సిగ్గులేకుండా కేసీఆర్, హరీశ్ రావు వ్యాఖ్యలు ఉన్నాయని ధ్వజమెత్తారు. ఆంధ్ర వాళ్లకు అమ్ముడు పోయిందే బీఆర్ఎ
ఉత్తమ్ సీరియస్


హైదరాబాద్, 22 డిసెంబర్ (హి.స.)

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, ఆ పార్టీ మాజీ మంత్రి హరీశ్ రావుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. సిగ్గులేకుండా కేసీఆర్, హరీశ్ రావు వ్యాఖ్యలు ఉన్నాయని ధ్వజమెత్తారు. ఆంధ్ర వాళ్లకు అమ్ముడు పోయిందే బీఆర్ఎస్ పార్టీ అని మండిపడ్డారు. ఇవాళ మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కేసీఆర్ డిజైన్ చేసి, నిర్మించిన కాళేశ్వరం వారి హయాంలోనే కూలిందని మేడిగడ్డ గురించి మాట్లాడటం ఆపి సిగ్గుతో తలదించుకోవాలన్నారు. తెలంగాణ ప్రజల తలలను తాకట్టు పెట్టి కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కూలిపోయిందని రాష్ట్రంలో ఇప్పుడు నడుస్తున్న ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో నిర్మించినవేనన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande