
హైదరాబాద్, 22 డిసెంబర్ (హి.స.)
ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలని నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు గ్రామ వార్డు సభ్యులకు మంత్రి దామోదర రాజనర్సింహ పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా ఎన్నికై, నేడు ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించిన నూతన గ్రామ పాలక కమిటీలకు మంత్రి శుభాకాంక్షలు ప్రజాస్వామ్య వ్యవస్థలో గ్రామ పంచాయతీలే అత్యంత కీలకమైనవని, మహాత్మా గాంధీ కలలు కన్న 'గ్రామ స్వరాజ్యం' సాకారం కావడంలో స్థానిక ప్రజాప్రతినిధుల పాత్ర ఎంతో అమూల్యమని మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..