
హైదరాబాద్, 22 డిసెంబర్ (హి.స.)
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలహీనమైందని గ్రహించే ఇక ప్రతిష్ట కాపాడుకోవడం కోసమే బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు బయటకు వచ్చారని మంత్రి జూపల్లి కృష్ణరావు ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ రెండేళ్ల పాలనకు రిఫరెండం అని చెప్పారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కలిసి పని చేశాయి. ఈ రెండు పార్టీలు కలిసి పని చేసినా మూడింట ఒక వంతు సీట్లు కూడా రాలేదు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు ఆరోపణలు తప్పు అని ప్రజలు తీర్పు ఇచ్చారు. దీంతో పార్టీని కాపాడుకోవడం కోసమే బయటకు వచ్చారు తప్ప పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయం ఏమి కాదని ఎద్దేవా చేశారు. ఇవాళ గాంధీ భవన్ లో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరితో కలిసి మీడియాతో మాట్లాడిన జూపల్లి.. నిన్న కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
బీఆర్ఎస్ పార్టీ కండలు కరిగిపోయి తోలు మాత్రమే మిగిలిందని సెటైర్ వేశారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు