మా తోలు తీస్తావా: కేసీఆర్కు మంత్రి పొన్నం కౌంటర్
హైదరాబాద్, 22 డిసెంబర్ (హి.స.) రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండి అసెంబ్లీకి రమ్మంటే రారు.. కానీ మా తోలు తీస్తారా అంటూ కేసీఆర్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ... రెండేళ్ల తర్వాత ఫామ్ హౌస్ నుంచ
మంత్రి పొన్నం


హైదరాబాద్, 22 డిసెంబర్ (హి.స.)

రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండి అసెంబ్లీకి రమ్మంటే రారు.. కానీ మా తోలు తీస్తారా అంటూ కేసీఆర్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ... రెండేళ్ల తర్వాత ఫామ్ హౌస్ నుంచి వచ్చి ఏది పడితే అది మాట్లాడతామంటే ఊరుకోమని అన్నారు. తాము ప్రజల చేత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వాళ్లమని అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా గౌరవమిచ్చి శాసనసభకు రమ్మంటున్నామని.. సీఎం కూడా అదే చెప్పారని అన్నారు. అసెంబ్లీ స్పీకర్ కూడా పెద్దాయనకు ఏమాత్రం గౌరవం తగ్గకుండా సభను నడుపుదామని అన్నారని తెలిపారు. శాసనసభలో జరిగే చర్చతో రాష్ట్రానికి ఎవరు ఏం చేశారో ప్రజలే తేలుస్తారని అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande