
నల్గొండ, 22 డిసెంబర్ (హి.స.)
విద్యార్థులు ఆత్మహత్యలు
చేసుకోకుండా చదువు పట్ల ఆత్మవిశ్వాసం పెంచేలా అవగాహన కల్పించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి ముగిసిన తర్వాత అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. గురుకుల విద్యాలయాల్లో చదువుతున్న కొందరు విద్యార్థులు మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు బాధ కలిగిస్తున్నాయని, ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా విద్యార్థులకు నిరంతరం మానసిక అవగాహన కల్పించాలని విద్యార్థులపై విద్యాభారం, వ్యక్తిగత సమస్యలు, కుటుంబ పరిస్థితుల కారణంగా ఒత్తిడి పెరుగుతోందని పేర్కొంటూ వాటిని అధిగమించే విధంగా కౌన్సిలింగ్ కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు