
హైదరాబాద్, 22 డిసెంబర్ (హి.స.)
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణను వేగవంతం చేసిన సిట్ అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. జూబ్లీహిల్స్ లోని సిట్ కార్యాలయానికి విచారణకు రావాలని వారికి ఇచ్చిన నోటీసుల్లో అధికారులు ఆదేశించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..