
మంచిర్యాల, 22 డిసెంబర్ (హి.స.)
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు
అక్కడికక్కడే దుర్మరణం పాలైన విషాద ఘటన మంచిర్యాల జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. జైపూర్ మండల పరిధిలోని ఇందారం వద్ద జాతీయ రహదారి 363పై ఆగి ఉన్న లారీని కారు వెనుక నుంచి అతివేగంతో బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో మొత్తం ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స సమీప నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేపట్టారు. అయితే, మృతులు మహారాష్ట్రకు చెందిన కూలీలుగా గుర్తించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు