
కడప, 23 డిసెంబర్ (హి.స.)
: మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు ( డిసెంబర్ 23) నుంచి మూడు రోజుల పాటు జిల్లాలోని పులివెందుల నియోజక వర్గంలో పర్యటించనున్నారు. ఆయన ఇవాళ సాయంత్రం 4 గంటలకు పులివెందుల చేరుకుని పులివెందుల వైసీపీ క్యాంప్ ఆఫీస్‌లో ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేసి.. బుధవారం ఉదయం 10.30 గంటలకు పులివెందుల నుంచి ఇడుపులపాయకు చేరుకుని ప్రేయర్ హాల్‌లో జరిగే క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో వైఎస్ జగన్ పాల్గొంటారు.
ఇక, రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి పులివెందులకు చేరుకుని భాకరాపేట క్యాంప్ ఆఫీస్‌లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. గురువారం ఉదయం 8.30 గంటలకు క్రిస్మస్ సందర్భంగా సీఎస్‌ఐ చర్చిలో జరిగే వేడుకల్లో పాల్గొననున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ