
హైదరాబాద్, 23 డిసెంబర్ (హి.స.)
రాష్ట్రంలో అక్రమార్కులపై అవినీతి నిరోధక శాఖ అధికారుల దాడులు కొనసాగుతున్నది. ఈ మేరకు ఇవాళ తాజాగా ఏసీబీ (ACB) అధికారులు మహబూబ్నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కిషన్ నాయక్ నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన పలు చోట్ల ఏకకాలంలో సోదాలు చేపట్టారు.
ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనపై ఇటీవలే కేసు నమోదైంది. అయితే, కిషన్ నాయక్కు సుమారు రూ.100 కోట్ల అక్రమ ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల్లో కిషన్ నాయక్ నివాసంతో పాటు బంధువులు, స్నేహితులు, బినామీల ఇళ్లలో మొత్తం 12 చోట్ల దాడులు కొనసాగుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..