తెలంగాణను వణికిస్తున్న చలి.. పొగమంచుతో కనిపించని వాహనాలు
తెలంగాణ, 23 డిసెంబర్ (హి.స.) తెలంగాణ వ్యాప్తంగా చలి విజృంభిస్తోంది. దీంతో హైదరాబాద్ సహా మొత్తం 28 జిల్లాలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా కోహిర్ లో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 5 డిగ్రీలుగా నమోదైంది. ఇటీవల న
చలి


తెలంగాణ, 23 డిసెంబర్ (హి.స.)

తెలంగాణ వ్యాప్తంగా చలి విజృంభిస్తోంది. దీంతో హైదరాబాద్ సహా మొత్తం 28 జిల్లాలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా కోహిర్ లో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 5 డిగ్రీలుగా నమోదైంది. ఇటీవల నమోదైన 4.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఈ సీజన్లో అతి తక్కువగా నిలిచింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ ముంబై

జాతీయ రహదారిపై దట్టమైన పొగమంచు కమ్ముకుపోవడంతో వాహనాలు కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande