కేరళలో దారుణం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి.
హైదరాబాద్, 23 డిసెంబర్ (హి.స.) ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వారి ఇంట్లో ప్రాణాలు కోల్పోయి కనిపించడం కలకలం గా మారింది. ఈ షాకింగ్ ఘటన కేరళలోని కన్నూర్ జిల్లా రామంతలి (Ramantali)లో గత రాత్రి చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తుల
కేరళలో దారుణం


హైదరాబాద్, 23 డిసెంబర్ (హి.స.)

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

వారి ఇంట్లో ప్రాణాలు కోల్పోయి కనిపించడం కలకలం గా మారింది. ఈ షాకింగ్ ఘటన కేరళలోని కన్నూర్ జిల్లా రామంతలి (Ramantali)లో గత రాత్రి చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు తమ నివాసంలో విగతజీవులుగా పడి ఉండటం, మృతుల్లో 38 ఏళ్ల వ్యక్తి, అతని 60 ఏళ్ల తల్లితో పాటు ఐదేళ్లు, రెండేళ్ల వయసున్న ఇద్దరు చిన్న పిల్లలు ఉండటం దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, 38 ఏళ్ల వ్యక్తి, అతని తల్లి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా కనిపిస్తుండగా, ఇద్దరు పసిపిల్లల మృతదేహాలు నేలపై పడి ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు ఈ అఘాయిత్యానికి కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande