
హైదరాబాద్, 23 డిసెంబర్ (హి.స.)
నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్-
విజయవాడ జాతీయ రహదారిపై హయత్నగర్ వాసులు మెరుపు ఆందోళనకు దిగారు. ఇటీవల రోడ్డు విస్తరణలో భాగంగా అడ్డగోలుగా పనులు చేపడుతున్నారని, ఫలితంగా చాలా మంది రోడ్డు దాటుతూ ప్రాణాలు కోల్పోతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో వెంటనే ప్రభుత్వం స్పందించి హైదరాబాద్-విజయవాడ హైవేపై హయత్నగర్ పరిధిలో పలుచోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జి లను యుద్ధ ప్రాతిపదికన వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ అనూహ్య పరిణామంతో హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు