ఎన్ఐఏ చీఫ్ సదానంద్ దాతేపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
హైదరాబాద్, 23 డిసెంబర్ (హి.స.) జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) డైరెక్టర్ జనరల్, 1990 బ్యాచ్ సీనియర్ ఐపీఎస్ అధికారి సదానంద్ వసంత్ దాతేను ఆయన మాతృ కేడర్ అయిన మహారాష్ట్రకు వెనక్కి పంపేందుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ పంప
Nia chief


హైదరాబాద్, 23 డిసెంబర్ (హి.స.)

జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) డైరెక్టర్ జనరల్, 1990 బ్యాచ్ సీనియర్ ఐపీఎస్ అధికారి సదానంద్ వసంత్ దాతేను ఆయన మాతృ కేడర్ అయిన మహారాష్ట్రకు వెనక్కి పంపేందుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ పంపిన 'ప్రీమెచ్యూర్ రిపాట్రియేషన్' ప్రతిపాదనను ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర నియామక కమిటీ (ACC) ఆమోదించింది. ప్రస్తుతం మహారాష్ట్ర డీజీపీగా ఉన్న రష్మీ శుక్లా పదవీ కాలం ఈ ఏడాది డిసెంబర్ 31తో ముగియనుండటంతో, తదుపరి రాష్ట్ర పోలీసు బాస్ (DGP)గా దాతేను నియమించాలని మహారాష్ట్ర ప్రభుత్వం కోరిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande