‘మన తొలివెలుగు' రఘుకు బిగ్ షాక్.. నోటీసులు ఇచ్చిన NIA అధికారులు
హైదరాబాద్, 23 డిసెంబర్ (హి.స.) ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ ''మన తొలి వెలుగు రఘు స్టూడియో''కు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) తాజాగా నోటీసులు జారీ చేసింది. మాజీ మావోయిస్టు నేత కట్టా రామచంద్రా రెడ్డి (వికల్ప్) మృతి చెందిన ప్రాంతానికి వెళ్లి వీడియో షూట్ చ
తొలివెలుగు రఘు


హైదరాబాద్, 23 డిసెంబర్ (హి.స.)

ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ 'మన

తొలి వెలుగు రఘు స్టూడియో'కు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) తాజాగా నోటీసులు జారీ చేసింది. మాజీ మావోయిస్టు నేత కట్టా రామచంద్రా రెడ్డి (వికల్ప్) మృతి చెందిన ప్రాంతానికి వెళ్లి వీడియో షూట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసినందుకు, అదేవిధంగా మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్య అరెస్టుకు కారణాలపై మరో వీడియో అప్లోడ్ చేసినందుకు గాను ఆయనకు నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఇవాళ గచ్చిబౌలి ఎన్ఐఏ కార్యాలయానికి వచ్చిన వివరణ ఇవ్వాలని మన తొలివెలుగు రఘుకు ఇచ్చిన నోటీసులలో స్పష్టంగా పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande