హిందువుల పై దాడులకు వ్యతిరేకంగా నల్గొండ జిల్లాలో ఆందోళనలు
నల్గొండ, 23 డిసెంబర్ (హి.స.) బంగ్లాదేశ్ లో హిందువుల పై జరుగుతున్న దాడులను నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ దేవరకొండ నగర ఆధ్వర్యంలో మంగళవారం ర్యాలీ నిర్వహించి, బంగ్లాదేశీ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్
విహెచ్పి


నల్గొండ, 23 డిసెంబర్ (హి.స.)

బంగ్లాదేశ్ లో హిందువుల పై జరుగుతున్న దాడులను నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ దేవరకొండ నగర ఆధ్వర్యంలో మంగళవారం ర్యాలీ నిర్వహించి, బంగ్లాదేశీ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి జూకురి సంపత్ వర్మ మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో మైనారిటీలుగా ఉన్న హిందువుల పై నిత్యం దాడులు చేస్తూ వారిని బలవంతంగా మతమార్పిడి చేస్తూ, అక్కడి మెజారిటీ ముస్లింలు నిత్యం మారణకాండ సృష్టిస్తున్నారని అన్నారు. బంగ్లాదేశ్ దేశవ్యాప్తంగా హిందువుల పై ప్రతినిత్యం దాడులు చేస్తున్న అక్కడి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆయన అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande