
నిజామాబాద్, 23 డిసెంబర్ (హి.స.) నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ శివారులోని అంకాపూర్ గ్రామ సమీపంలో గత అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆర్మూర్ శివారు అంకాపూర్ దగ్గర బైక్, ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు వెంటనే వారిని చికిత్స నిమిత్తం నిజామాబాదు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు