బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను నిరసిస్తూ హైదరాబాద్లో విహెచ్పి ఆందోళన
హైదరాబాద్, 23 డిసెంబర్ (హి.స.) బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ హైదరాబాద్లోని కొత్తపేటలో విశ్వహిందూ పరిషత్ ఇతర అనుబంధ హిందూ సంఘాలు భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ సందర్భంగా విహెచ్పి జాతీయ ప్రతినిధి శశిధర్ మాట్ల
విహెచ్పి ఆందోళన


హైదరాబాద్, 23 డిసెంబర్ (హి.స.) బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులపై

జరుగుతున్న దాడులను నిరసిస్తూ హైదరాబాద్లోని కొత్తపేటలో విశ్వహిందూ పరిషత్ ఇతర అనుబంధ హిందూ సంఘాలు భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ సందర్భంగా విహెచ్పి జాతీయ ప్రతినిధి శశిధర్ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్లో హిందువులపై అమానుష దాడులు జరుగుతున్నాయని, వారి రక్షణ కోసం భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పొరుగు దేశంలో హిందూ సమాజం ఎదుర్కొంటున్న వేధింపుల పట్ల ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande