
అమరావతి, 23 డిసెంబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తన శాఖల ద్వారా పరిపాలనలో సరికొత్త రికార్డులు (New records) సృష్టిస్తున్నారు. ఆయన పర్యవేక్షణలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు (Panchayat Raj and Rural Development Departments) జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించాయి. గతంలో ఉద్యోగుల శిక్షణ, సామర్థ్య పెంపులో దేశవ్యాప్తంగా 24వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే నెంబర్ వన్ స్థానానికి చేరుకోవడం విశేషం. ఆయన తీసుకున్న ప్రత్యేక చొరవ, నిరంతర సమీక్షల ఫలితంగానే ఏపీ ఈ ఘనత సాధించిందని జాతీయ స్థాయి సంస్థలు సైతం ప్రశంసిస్తున్నాయి.
ముఖ్యంగా శాఖాపరమైన ఉద్యోగులకు వృత్తిపరమైన శిక్షణ (Professional training) ఇవ్వడంలోనూ, వారి పనితీరును మెరుగుపరచడానికి అత్యధిక సంఖ్యలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడంలోనూ ఏపీ దేశంలోనే ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. . జాతీయ స్థాయిలో ఈ స్థాయి గుర్తింపు రావడం పట్ల ప్రభుత్వ వర్గాలతో పాటు పార్టీ శ్రేణులు, కూటమి నేతలు ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV