శ్రీహరికోట లో LVM -3 M6 రాకెట్ ప్రయోగం విజయవంతం
అమరావతి, 24 డిసెంబర్ (హి.స.) తిరుపతి, శ్రీహరి కోటలో LVM-3 M-6 రాకెట్‌ ప్రయోగం విజయవంతం అయ్యింది. అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ బ్లూ బర్డ్ బ్లాక్-2ను ఈ రాకెట్ విజయవంతంగా నింగిలోకి తీసుకెళ్లింది. తొలిసారిగా ఇంతటి భారీ ఉపగ్రహాన్ని ఇస్
శ్రీహరికోట లో LVM -3 M6 రాకెట్ ప్రయోగం విజయవంతం


అమరావతి, 24 డిసెంబర్ (హి.స.)

తిరుపతి, శ్రీహరి కోటలో LVM-3 M-6 రాకెట్‌ ప్రయోగం విజయవంతం అయ్యింది. అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ బ్లూ బర్డ్ బ్లాక్-2ను ఈ రాకెట్ విజయవంతంగా నింగిలోకి తీసుకెళ్లింది. తొలిసారిగా ఇంతటి భారీ ఉపగ్రహాన్ని ఇస్రో నింగిలోకి పంపింది. కేవలం 15 నిమిషాల్లోనే బ్లూబర్డ్‌ ప్రయోగం విజయవంతమైంది. అమెరికాకు చెందిన ఏఎస్‌టీ (AST) స్పేస్ మొబైల్ సంస్థతో కలిసి ఇస్రో ఈ ప్రయోగం నిర్వహించింది. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా 4G, 5G సేవలను బ్లూ బార్డ్ బ్లాక్-2 అందించనుంది. ఎల్‌వీఎం 3 రాకెట్ సిరీస్‌లో ఇది 9వ ప్రయోగం.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande