సీనియర్ సెంట్రల్ గవర్నమెంట్ ప్యానెల్ కౌన్సిల్గా వరంగల్ జిల్లా వాసి
వరంగల్, 25 డిసెంబర్ (హి.స.) వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం లోని గుండ్లపహాడ్ గ్రామానికి చెందిన హైకోర్టు అడ్వకేట్ పడాల ప్రవీణ్ కుమార్ కు అరుదైన గౌరవం దక్కింది. ఆయనను సీనియర్ సెంట్రల్ గవర్నమెంట్ ప్యానెల్ కౌన్సిల్ గా నియమిస్తూ కేంద్ర న్యాయ శాఖ ఉత్తర్
వరంగల్ అడ్వకేట్


వరంగల్, 25 డిసెంబర్ (హి.స.) వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం లోని

గుండ్లపహాడ్ గ్రామానికి చెందిన హైకోర్టు అడ్వకేట్ పడాల ప్రవీణ్ కుమార్ కు అరుదైన గౌరవం దక్కింది. ఆయనను సీనియర్ సెంట్రల్ గవర్నమెంట్ ప్యానెల్ కౌన్సిల్ గా నియమిస్తూ కేంద్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాబోయే మూడేళ్ల పాటు తెలంగాణ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ కీలక కేసులను వాదించే బాధ్యతలను ప్రవీణ్ కుమార్ నిర్వర్తించనున్నారు. ఇంతకుముందు ఆయన హైకోర్టులో లోకాయుక్త, ఉపలోకాయుక్తలకు కౌన్సిల్ గా సేవలందిస్తూ న్యాయరంగంలో విశిష్ట గుర్తింపు తెచ్చుకున్నారు. గుండ్లపహాడ్ గ్రామం నుంచి వచ్చి కేంద్ర ప్రభుత్వ న్యాయ ప్యానెల్లో చోటు సంపాదించుకోవడం స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande