
హైదరాబాద్, 25 డిసెంబర్ (హి.స.)
దేశవ్యాప్తంగా క్రీడా సంస్కృతిని
పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న 'సంసద్ ఖేల్ మహోత్సవ్' (2025) ముగింపు వేడుకల నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యువ అథ్లెట్లతో వర్చువల్గా ముచ్చటించారు. నేటి యువతలో కనిపిస్తున్న ఉత్సాహం, క్రమశిక్షణే రేపటి 'వికసిత భారత్'కు అసలైన బలం అని ఆయన కొనియాడారు. కేవలం మైదానంలో పతకాలు గెలవడమే కాకుండా, క్రీడల ద్వారా లభించే ఆత్మవిశ్వాసాన్ని జీవితంలోనూ విజయాలు సాధించేందుకు ఉపయోగించుకోవాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. డిసెంబర్ 23 నుంచి 25 వరకు జరిగిన ఈ క్రీడా సంబరాలు గ్రామీణ స్థాయి క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాయని ఆయన పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..