
హైదరాబాద్, 25 డిసెంబర్ (హి.స.)
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం
మరింత దిగజారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. ఇవాళ ఆయన రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయ్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల భాష ఏమాత్రం బాగోలేదని అన్నారు. మొన్న కెసిఆర్ నిన్న రేవంత్ రెడ్డి పెద్ద హోదాల్లో ఉండి ఇలాగేనా మాట్లాడేదని అన్నారు. రాజకీయాల్లో రాబోయే భవిష్యత్తు తరాలకు ఏం నేర్పిస్తున్నారని ఫైర్ అయ్యారు. పదేళ్ల పాటు పాలించిన కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని.. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం మరింత దిగజారిపోయిందని అన్నారు. ఎక్కడా అభివృద్ధి లేదని.. గ్రాఫిక్స్ మాయ తో చేయాలని చూస్తున్నారని కామెంట్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..