డ్రగ్స్ ను నివారించరించడం మనందరి బాధ్యత : భువనగిరి పోలీసులు
యాదాద్రి భువనగిరి, 24 డిసెంబర్ (హి.స.) మత్తు పదార్థాల వాడకం వల్ల కలిగే అనర్ధాలపై భువనగిరి పోలీసులు బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన భువనగిరి ఇన్స్పెక్టర్ చంద్రబాబు.. యువత డ్రగ్స్ బారిన పడకుండా నివారించడం మన అందరి సామ
భువనగిరి పోలీస్


యాదాద్రి భువనగిరి, 24 డిసెంబర్ (హి.స.) మత్తు పదార్థాల వాడకం వల్ల కలిగే అనర్ధాలపై భువనగిరి పోలీసులు బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన భువనగిరి ఇన్స్పెక్టర్ చంద్రబాబు.. యువత డ్రగ్స్ బారిన పడకుండా నివారించడం మన అందరి సామాజిక బాధ్యత అని అన్నారు.

డ్రగ్ దందా చేసే వాళ్ళని వదిలి పెట్టకుండా పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు. యువత డ్రగ్స్ కు బానిస కావడం వల్ల జీవితాలనే కోల్పోవాల్సి వస్తుందని యువత జాగ్రతగా ఉండాలని సూచించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande