
నారాయణపేట, 24 డిసెంబర్ (హి.స.)
కొడంగల్ నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ నారాయణపేట్ జిల్లా కోస్గి పర్యటన సందర్భంగా కొత్తగా ఎన్నికైన సర్పంచ్లను ఆయన సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. దేశ పునాదులు గ్రామాల్లో ఉన్నాయని గాంధీ చెప్పారని.. గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. నిరుపేదలకు సంక్షేమ పథకాలు చేరినప్పుడే నిజమైన పాలన అందుబాటులోకి వస్తుందని అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు