
అమరావతి, 24 డిసెంబర్ (హి.స.)
గాజువాక (విశాఖ): నగరంలోని గాజువాక పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్సైపై కేసు నమోదైంది. 2023లో నలుగురు కానిస్టేబుళ్ల నుంచి అధిక వడ్డీ ఆశ చూపి రూ.15 లక్షల వరకు వసూలుచేసిన ఏఎస్సై మోతుపల్లి నర్సింహరాజుపై కేసు నమోదు చేసినట్లు సీఐ పార్థసారథి తెలిపారు.
సీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2023 జూన్‌లో ట్రాఫిక్ విభాగంలో ఏఎస్సైగా పనిచేస్తున్న నర్సింహరాజు సహచర కానిస్టేబుళ్లు సన్యాసినాయుడు, శేఖర్, త్రినాథ్, రవి, నానాజీల నుంచి రూ.15.30 లక్షలను అధిక వడ్డీ ఆశ చూపి తీసుకున్నాడు. రూ.లక్షకు రూ.10 వేలు చొప్పున రెండు నెలల పాటు వడ్డీ చెల్లించాడు. ఆ తర్వాత నుంచి తాను షేర్‌మార్కెట్‌లో క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌లో నష్టపోయానని తప్పించుకుంటూ వచ్చాడు. రోజులు గడిచిపోతున్నా న్యాయం జరగకపోవడంతో కానిస్టేబుల్ సన్యాసినాయుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దీనిపై విచారణ చేస్తున్నట్లు సీఐ పార్థసారథి తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ