నెల రోజుల్లో నిధులివ్వాలంటూ సర్కార్ కు బండి సంజయ్ డెడ్లైన్
హైదరాబాద్, 24 డిసెంబర్ (హి.స.) తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు నిధుల విడుదల విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నెల రోజుల్లోగా పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని, లేని పక్షంలో హైదరాబాద్ నడిబొడ్డున రాష్ట్రవ్యాప్త సర
బండి సంజయ్


హైదరాబాద్, 24 డిసెంబర్ (హి.స.)

తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు

నిధుల విడుదల విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నెల రోజుల్లోగా పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని, లేని పక్షంలో హైదరాబాద్ నడిబొడ్డున రాష్ట్రవ్యాప్త సర్పంచులు, ఉప సర్పంచులతో భారీ 'పరేడ్' నిర్వహిస్తామని డెడ్ లైన్ విధించారు. గ్రామాలకు నిధులు వచ్చే వరకు పోరాటం ఆపేది లేదని, రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా నిధులు సాధిస్తామని ఆయన హెచ్చరించారు. పార్టీ గుర్తుతో పంచాయతీ ఎన్నికలు నిర్వహించి ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా వచ్చేది కాదని ఆయన ఎద్దేవా చేశారు.

కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో గెలిచిన 108 మంది బీజేపీ మద్దతుదారులైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను ఘనంగా సన్మానించిన బండి సంజయ్, తన నియోజకవర్గ అభివృద్ధిపై కీలక ప్రకటనలు చేశారు. తన పరిధిలోని ఈ 108 గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని, ప్రతి ఊరిలో వాటర్ ప్లాంట్, ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు (PHC) అవసరమైన వైద్య పరికరాలను అందిస్తానని హామీ ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande