
ఢిల్లీ24,డిసెంబర్ (హి.స.) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘ఇస్రో’ ఈరోజు (2025, డిసెంబర్ 24) ప్రయోగించిన ‘బ్లూబర్డ్ బ్లాక్-2’ ఉపగ్రహం టెలికాం రంగంలో ఒక సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది. సాధారణంగా మనం వాడే ఇంటర్నెట్ కోసం ప్రత్యేకమైన డిష్‌లు లేదా శాటిలైట్ ఫోన్‌లు అవసరమవుతాయి. కానీ, ‘బ్లూబర్డ్ బ్లాక్-2’ సాంకేతికతతో ఎటువంటి అదనపు పరికరాలు లేకుండానే మన సాధారణ 4జీ/5జీ స్మార్ట్‌ఫోన్‌లకు నేరుగా బ్రాడ్‌బ్యాండ్ సిగ్నల్స్ అందుతాయి. ఇది మొబైల్ కనెక్టివిటీలో ఒక అద్భుతమైన మార్పును తీసుకురానుంది
బ్లూబర్డ్ బ్లాక్-2 ప్రయోగం రాబోయే రోజుల్లో 'కనెక్టెడ్ వరల్డ్' కలలను నిజం చేయనుంది. ప్రతి ఒక్కరికీ, ప్రతి చోటా ఇంటర్నెట్ అందుబాటులో ఉండాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. ఇది కేవలం సాంకేతిక మార్పు మాత్రమే కాదు.. సామాజిక, ఆర్థిక విప్లవం. ప్రపంచ డిజిటల్ మ్యాప్‌లో భారతదేశాన్ని అత్యున్నత స్థానంలో నిలపనుంది. అలాగే దేశంలోని సామాన్యుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ఈ ఉపగ్రహం కీలక పాత్ర పోషించనుంది.
ఈ మిషన్ అంతరిక్ష రంగంలో భారతదేశ శక్తిని ప్రపంచానికి చాటి చెబుతుంది. బ్లూబర్డ్ ఉపగ్రహాలను ఇస్రో తన బాహుబలి రాకెట్ LVM3 ద్వారా ప్రయోగించడం ద్వారా, అంతర్జాతీయ వాణిజ్య మార్కెట్‌లో భారత్ తిరుగులేని శక్తిగా ఎదగనుంది. ఇది న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఐఎల్) వంటి సంస్థలకు మరిన్ని విదేశీ ప్రాజెక్టులను దక్కించుకునేందుకు, దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వడానికి దోహదపడుతుంది.
ISRO/
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ