దేశ రాజకీయాలలో కీలక పరిణామం.. మాజీ మావోయిస్టుల కొత్త పార్టీ!
హైదరాబాద్, 24 డిసెంబర్ (హి.స.) దేశంలో మరో జాతీయ పార్టీ పురుడు పోసుకోనున్నట్లు తెలుస్తోంది. మాజీ మావోయిస్టులు మల్లోజుల వేణుగోపాల్, తక్కెళ్లపల్లి అలియాస్ సోనూ, వాసుదేవరావు అలియాస్ ఆశన్నల నేతృత్వంలో త్వరలో కొత్త మావోయిస్టు పార్టీ రూపుదిద్దు కోనున్
మావోయిస్టు పార్టీ


హైదరాబాద్, 24 డిసెంబర్ (హి.స.)

దేశంలో మరో జాతీయ పార్టీ పురుడు పోసుకోనున్నట్లు తెలుస్తోంది. మాజీ మావోయిస్టులు మల్లోజుల వేణుగోపాల్, తక్కెళ్లపల్లి అలియాస్ సోనూ, వాసుదేవరావు అలియాస్ ఆశన్నల నేతృత్వంలో త్వరలో కొత్త మావోయిస్టు పార్టీ రూపుదిద్దు కోనున్నట్లు సమాచారం. సాయుధ బాటలో కాకుండా భారత రాజ్యాంగ పరిధిలో పార్టీ పని చేయనున్నది. ఇటీవల ఆశన్న ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు. 'మీ భవిష్యత్తు కార్యక్రమం ఏమిటి? బస్తర్లోనే ఉంటారా? లేక స్వస్థలం వరంగల్ వెళ్తారా?' అన్న ప్రశ్నకు ఆయన కొత్త పార్టీ విషయం ప్రస్తావించారు. ప్రజల కోసం రాజ్యాంగ పరిధిలో పని చేస్తామని, మరోమారు ఆయుధాలు చేపట్టబోమని స్పష్టం చేశారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande