యూనస్‌ మెడకు చుట్టుకున్న హాదీ హత్య.
ఢాకా: ఢిల్లీ24,డిసెంబర్ (హి.స.) రాజకీయ అస్థిరత నెలకొన్న బంగ్లాదేశ్‌లో నానాటికీ పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. యువనేత ఉస్మాన్‌ హాదీ హత్యలో ప్రభుత్వం ప్రమేయం ఉందన్న ఆరోపణలు తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్‌ యూనస్‌ను (Muhammad Yunus) చిక్కుల్లో పడ
యూనస్‌ మెడకు చుట్టుకున్న హాదీ హత్య.


ఢాకా: ఢిల్లీ24,డిసెంబర్ (హి.స.) రాజకీయ అస్థిరత నెలకొన్న బంగ్లాదేశ్‌లో నానాటికీ పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. యువనేత ఉస్మాన్‌ హాదీ హత్యలో ప్రభుత్వం ప్రమేయం ఉందన్న ఆరోపణలు తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్‌ యూనస్‌ను (Muhammad Yunus) చిక్కుల్లో పడేస్తున్నాయి. అదే సమయంలో అవామీ లీగ్‌ పార్టీపై నిషేధం విధించడంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేయడం కూడా యూనస్‌ సర్కారును ఇబ్బంది పెడుతోంది. (Bangladesh Protests)

యువ నాయకుడు, ఇంకిలాబ్‌ మోంచో నేత షరీఫ్‌ ఉస్మాన్‌ హాదీ (Sharif Osman Hadi Killing) హత్యతో ఇటీవల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. దీనిపై హాదీ సోదరుడు తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. హాదీ హత్యలో యూనస్‌ ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల హస్తం ఉన్నట్లు ఆరోపించారు. ‘‘ఉస్మాన్‌ హాదీని మీరే (యూనస్‌ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ) చంపేశారు. ఈ ఘటనను ఉపయోగించుకొని వచ్చే ఏడాది జరగాల్సిన ఎన్నికలు రద్దు చేయాలని చూస్తున్నారు. నా సోదరుడి హత్యపై వేగంగా దర్యాప్తు జరిపి హంతకులను పట్టుకోవాలి. హాదీకి న్యాయం జరగకపోతే.. మీరు కూడా ఏదో ఒకరోజు బంగ్లాదేశ్‌ను వీడి పారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది జాగ్రత్త..!’’ అని ఉస్మాన్‌ హాదీ సోదరుడు ఒమర్ హెచ్చరించాడు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande