ఎయిర్ ఫ్యూరిఫైయర్లపై జీఎస్టీ.. ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ, 24 డిసెంబర్ (హి.స.) ఢిల్లీ ప్రజలను ఊపిరిసలపనివ్వకుండా చేస్తున్న వాయుకాలుష్యం విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలుష్యంతో ఊపిరాడక జనం నరకం చూస్తుంటే ఎయిర్ ఫ్యూరిఫైయర్లపై (Air Purifiers) జీఎస్టీ వేస్తార
ఢిల్లీ హైకోర్టు


న్యూఢిల్లీ, 24 డిసెంబర్ (హి.స.)

ఢిల్లీ ప్రజలను ఊపిరిసలపనివ్వకుండా చేస్తున్న వాయుకాలుష్యం విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలుష్యంతో ఊపిరాడక జనం నరకం చూస్తుంటే ఎయిర్ ఫ్యూరిఫైయర్లపై (Air Purifiers) జీఎస్టీ వేస్తారా? అని మండిపడింది. ఎయిర్ ఫ్యూరిఫైయర్లపై జీఎస్టీ ఎందుకు తొలగించరు? దీనిపై సమాధానం చెప్పాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఎయిర్ ప్యూరిఫైయర్లను విలాసవంతమైన వస్తువుల జాబితాలో చేర్చి 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారని వెంటనే వీటిని వైద్య పరికరాల జాబితా చేర్చి పన్నును ఐదు శాతానికి తగ్గించాలని కోరుతూ కపిల్ మదన్ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇవాళ చీఫ్ జస్టిస్ డికె ఉపాధ్యాయ, జస్టిస్ తుషార్ రావుతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించాలని లేదా ఎయిర్ ఫ్యూరిఫైయర్లపై జీఎస్టీని తగ్గించాలని కేంద్రానికి అల్టిమేటం జారీ చేసింది. ఎయిర్ ఫ్యూరిఫైయర్లను విలాసవంతమైన వస్తువులుగా పరిగణించలేమని కోర్టు పేర్కొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande