
అమరావతి, 24 డిసెంబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్పల్ప అస్వస్థతకు గురయ్యారు. గత రెండ్రోజులుగా ఆయన జ్వరంతో బాధపడుతున్న వైద్యులు తెలిపారు. ఆయన ప్రస్తుతం చాలా నీరసంగా ఉన్నారని.. ఆయనుకు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. రెండు మూడు రోజులు ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాలన్నారు. దీంతో ఆయన వైద్యుల సూచన మేరకు ఇంట్లోనే ఉండనున్నారు.
అయితే రేపు క్రిస్‌మస్ పండుగను పురస్కరించుకొని పులివెందులలో ఇవాళ ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలకు మాజీ సీఎం జగన్ హాజరుకావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఆయన అనారోగ్యం కారణంగా ఈ కార్యక్రమాలు అన్నింటిని రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని పార్టీ నేతలు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. మరోవైపు జగన్ అనారోగ్యం గురించి తెలిసిన అభిమానులు ఆయన త్వరగా కొలుకోవాలని కోరుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV