నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే.. దానం సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, 24 డిసెంబర్ (హి.స.) తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న తరుణంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీంతో ఆయనపై వేటు ఖాయమేనా? అన్న చర్చ సాగుతోంద
దానం నాగేందర్


హైదరాబాద్, 24 డిసెంబర్ (హి.స.) తెలంగాణ రాజకీయాల్లో పార్టీ

ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న తరుణంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీంతో ఆయనపై వేటు ఖాయమేనా? అన్న చర్చ సాగుతోంది. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. 'ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో నాకు తెలియదు. కానీ నేను మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను' అని స్పష్టం చేశారు. తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుందని, అదే తన స్పెషాలిటీ అని పేర్కొన్నారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎంఐఎం మొత్తం 300 డివిజన్లు గెలుస్తాయని ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ అంతటా తాను తిరిగి ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తానని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande