మేడారం జాతరలో కీలక ఘట్టం.. గద్దెల ప్రతిష్టాపన
ములుగు, 24 డిసెంబర్ (హి.స.) ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో నూతనంగా ఏర్పాటు చేసిన గద్దెలపై నేడు పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల ప్రతిష్టాపన ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం జరిగింది. బుధవారం ఉదయం 6 గంటలకు గోవిందరాజు గద్దె, ఉదయం 9.45 గంటలకు పగిడి
మేడారం


ములుగు, 24 డిసెంబర్ (హి.స.)

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో నూతనంగా ఏర్పాటు చేసిన గద్దెలపై నేడు పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల ప్రతిష్టాపన ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం జరిగింది. బుధవారం ఉదయం 6 గంటలకు గోవిందరాజు గద్దె, ఉదయం 9.45 గంటలకు పగిడిద్దరాజు గద్దెను పూజారులు శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, జాతర కార్యనిర్వహణాధికారి వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం సందర్భంగా భద్రతా కారణాల దృష్ట్యా భక్తులను గద్దెల ప్రాంగణంలోకి అనుమతించలేదు. కాగా నిన్న రాత్రి నుంచే కొండాయి గ్రామం సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు పూజారులు తమ కుటుంబాలతో కలిసి పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జనవరి 28 నుంచి 31 వరకు సమ్మక్క సారక్క జాతర జరగనున్న సంగతి తెలిసిందే.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande