
నారాయణపేట, 24 డిసెంబర్ (హి.స.)
ప్రజలకు ముఖ్యంగా పేదవారికి తమ ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో నేడు ఉదయం మంత్రి
అనుచరుని చాయి దుకాణం ప్రారంభించారు. అనంతరం మంత్రి వాకిటి మాట్లాడుతూ.. మంత్రిగా ప్రారంభించింది చిన్నదే అయిన ఒకరికి ఉపాధి కల్పించానన్న తృప్తి ఉందన్నారు. తనను నమ్ముకుని తన చేతి కింద పని చేసిన వారందరికీ ఉపాధి కల్పించడంలో భాగంగా బస్టాండ్ ఏరియాలో నారాయణ పేట ఆర్టీసీడిఎంతో మాట్లాడి.. బస్టాండ్ ముందు టీ కొట్టును సాగించేలా అధికారికంగా ఉత్తర్వులు తీసుకుని టీ కొట్టు ఏర్పాటు చేయడానికి ఆర్థిక సాయం చేశారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..