కెనడాలో భారతీయ మహిళ హత్య.!
ఢిల్లీ24,డిసెంబర్ (హి.స.) కెనడాలోని(Canada) టొరంటోలో హిమాన్షీ ఖురానా అనే 30 ఏళ్ల భారతీయ మహిళ హత్యకు గురయ్యారు. ఈ హత్యకు సంబంధించి అనుమానితుడిగా భావిస్తోన్న అబ్దుల్ గఫూరీ ) కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. డిసెంబర్ 19న ఖురానా అదృశ్యమైనట్టు
కెనడాలో భారతీయ మహిళ హత్య.!


ఢిల్లీ24,డిసెంబర్ (హి.స.)

కెనడాలోని(Canada) టొరంటోలో హిమాన్షీ ఖురానా అనే 30 ఏళ్ల భారతీయ మహిళ హత్యకు గురయ్యారు. ఈ హత్యకు సంబంధించి అనుమానితుడిగా భావిస్తోన్న అబ్దుల్ గఫూరీ ) కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

డిసెంబర్ 19న ఖురానా అదృశ్యమైనట్టు పోలీసులకు సమాచారం అందింది. దీని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టి ఓ ఇంట్లో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఖురానాపై తొలుత లైంగిక దాడి జరిగినట్టు అనుమానం వ్యక్తం చేసిన అధికారులు.. ఆపై హత్యకు గురైనట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా.. గఫూరీతో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఈ హత్యకు అబ్దుల్ గఫూరీకి సంబంధముందని పోలీసులు భావిస్తున్నారు. అందులో భాగంగా పరారీలో ఉన్న గఫూరీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. అనుమానిత నిందితుణ్ని పట్టుకోవడంలో భాగంగా ఇప్పటికే అతడి ముఖ చిత్రాన్ని కూడా విడుదల చేసినట్టు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande