పాక్‌ నేత తిరుగుబాటు.. భారత్‌కు మద్దతు
ఇస్లామాబాద్‌/ఢిల్లీ24,డిసెంబర్ (హి.స.) పాకిస్తాన్‌కు చెందిన నేత ఒకరు తమ దేశం వ్యవహరిస్తున్న తీరుపై పశ్చాత్తాప ధోరణిలో మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. ఆఫ్ఘనిస్తాన్‌పై పాక్‌ జరిపిన సైనిక దాడులను జమియత్ ఉలేమా ఈ ఇస్లాం ఎఫ్ (జేయూఐ-ఎఫ్‌) చీఫ్ మౌలానా ఫ
పాక్‌ నేత తిరుగుబాటు.. భారత్‌కు మద్దతు


ఇస్లామాబాద్‌/ఢిల్లీ24,డిసెంబర్ (హి.స.) పాకిస్తాన్‌కు చెందిన నేత ఒకరు తమ దేశం వ్యవహరిస్తున్న తీరుపై పశ్చాత్తాప ధోరణిలో మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. ఆఫ్ఘనిస్తాన్‌పై పాక్‌ జరిపిన సైనిక దాడులను జమియత్ ఉలేమా ఈ ఇస్లాం ఎఫ్ (జేయూఐ-ఎఫ్‌) చీఫ్ మౌలానా ఫజ్లూర్ రెహ్మాన్ తప్పుబట్టారు. పాక్ సైన్యం జరిపిన దాడుల్లో సామాన్య పౌరులు మృతి చెందడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫ్ఘనిస్తాన్‌పై దాడులు చేయడం సరైనదని పాక్‌ భావించినప్పుడు.. భారతదేశం తన పొరుగుదేశమైన పాకిస్తాన్‌పై దాడులు చేయడంలో తప్పేముందని ప్రశ్నించారు.

భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ గురించి ప్రస్తావిస్తూ రెహ్మాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత మే 7న భారత దళాలు పాకిస్తాన్ భూభాగంలోని బహవల్పూర్, మురిడ్కే, పీఓకేలోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై క్షిపణి దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 22న 26 మంది భారతీయులను లష్కరే ఎ తోయిబా ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నందుకు ప్రతీకారంగా భారత్ ఈ ఆపరేషన్ చేపట్టింది. ఈ దాడులను పాక్ నేత బహిరంగంగా ప్రస్తావించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande