
రాజన్న సిరిసిల్ల, 24 డిసెంబర్ (హి.స.)
ఆయిల్ పామ్ సాగు అన్ని కాలాలకు అనుకూలంగా ఉంటుందని, నాలుగో ఏడాది నుంచి అధిక దిగుబడి.. ఆదాయం వస్తుందని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ గరిమ అగర్వాల్ తెలిపారు. ఆయిల్ పామ్ సాగు పై రైతులకు ఉద్యానవన, వ్యవసాయ, సహకార శాఖ ఆధ్వర్యంలో బుధవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించగా ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా మండలానికి చెందిన రైతులు ఆయిల్ పామ్ సాగు చేసిన విధానం, పంట ఉత్పత్తి, ఆదాయం, అంతర పంటల సాగు పై తెలియజేశారు. ఆయిల్ పామ్ మొక్కలకు సబ్సిడీ పై ఇచ్చారని, అంతర పంటల సాగు, ఎరువులు, మొక్కల యాజమాన్యానికి ప్రతి ఏడాది డబ్బులు అందించారని వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. దేశం ప్రతి ఏడాది విదేశాల నుంచి నూనె దిగుమతి చేసుకుంటుందని తెలిపారు.
ఆ దిగుమతుల భారం తగ్గించేందుకు, ఆయిల్ పామ్ లో స్వయం సంవృద్ధి సాధించేందుకు ఆయిల్ పామ్ సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు