
హైదరాబాద్, 24 డిసెంబర్ (హి.స.)
రాష్ట్రంలో ఒక్క విద్యార్థి కూడా లేని
ప్రభుత్వ పాఠశాలలను తాత్కాలికంగా మూసివేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. 2024-25 విద్యా సంవత్సరం లెక్కల ప్రకారం తెలంగాణలో మొత్తం 2,245 జీరో పాఠశాలలు ఉండగా. వీటిలో 1,441 పాఠశాలల్లో విద్యార్థులు, టీచర్ పోస్టులు రెండూ లేకపోగా, మరో 600 పాఠశాలల్లో విద్యార్థులు లేరు కానీ టీచర్ పోస్టులున్నాయి. ప్రస్తుతానికి పిల్లలు, ఉపాధ్యాయులు లేని 1,441 పాఠశాలలను 'తాత్కాలిక మూసివేస్తున్నామని అధికారులు తెలిపారు. ఒకవేళ గ్రామస్థులు పిల్లలను పంపేందుకు ముందుకు వస్తే వెంటనే పాఠశాలలను తిరిగి ప్రారంభించి టీచర్లను నియమిస్తామని స్పష్టం చేశారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..