
హైదరాబాద్, 24 డిసెంబర్ (హి.స.)
ఆదాయానికి మించిన ఆస్తుల
కేసులో మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ కిషన్ నాయక్ కు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను ఇవాళ తెల్లవారుజామున చంచల్గూడా జైలుకు తరలించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు మంగళవారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లి ఆర్ఆర్ నగర్ కాలనీలోని కిషన్ నాయక్ నివాసం, హైదరాబాద్, నిజామాబాద్, నారాయణఖేడ్లలో ఆయన బంధువులు, సన్నిహితుల నివాసాలతో పాటు మహబూబ్ నగర్ లోని జిల్లా రవాణా శాఖ కార్యాలయం సహా 12 చోట్ల ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఈ సోదాలు ముగిసిన అనంతరం డీటీసీ కిషన్ నాయక్ ను అధికారులు ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచగా 14 రోజుల రిమాండ్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
నిన్నటి సోదాల్లో కిషన్ నాయక్ కు చెందిన స్థిర, చర ఆస్తుల విలువ 400 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..