
హైదరాబాద్, 24 డిసెంబర్ (హి.స.) కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం కీలక
నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో ఏర్పడిన పగుళ్లు, ఇతర లోపాల మరమ్మత్తులు చేప్పట్టేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ బ్యారేజీలపై సర్కార్ డీపీఆర్ లను సిద్ధం చేయిస్తోంది. ఈ మరమ్మత్తుల పనులను ఆర్వీ అసోసియేట్స్ కు అప్పగిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు తుమ్మిడిహట్టి DPR ను కూడా రూపొదింస్తుండగా.. వచ్చే 3 నెలల్లో రిపోర్ట్ అందించాలని సదరు సంస్థ గడువు విధించింది. రిపోర్ట్ ప్రభుత్వానికి అందగానే ఆయా పనులకు టెండర్లు పిలిచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..