
దిల్లీ , 24 డిసెంబర్ (హి.స.)కాలుష్యంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తంచేశారు. ఇక్కడ ఉన్న మూడు రోజుల్లోనే తనకు అలర్జీ వచ్చిందని వెల్లడించారు. దేశ రాజధానిలో జరిగిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు (Delhi Pollution).
‘‘నేను ఇక్కడ మూడు రోజులుగా ఉంటున్నాను. ఈ కాలుష్యం వల్ల నాకు అలర్జీ వచ్చింది. నేను రవాణా శాఖ మంత్రిగా ఉన్నాను. రవాణా వల్లే 40 శాతం కాలుష్యం వస్తోంది. శిలాజ ఇంధనాల వాడకాన్ని గణనీయంగా తగ్గించాల్సిన అవసరం ఉంది. శిలాజ ఇంధనాలు పరిమితంగా ఉన్నాయి. కానీ కాలుష్యం మాత్రం పెరిగిపోతోంది. మనం వాటి వాడకాన్ని తగ్గించలేమా..? కాలుష్యాన్ని తగ్గించే ఎలక్ట్రిక్ వాహనాలు, హైడ్రోజన్ ఆధారిత వాహనాలకు ప్రోత్సాహం లభించాలి’’ అని గడ్కరీ (Nitin Gadkari) వ్యాఖ్యలు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ