
అమరావతి, 25 డిసెంబర్ (హి.స.) :క్రైస్తవులకు గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఇది ఏసుక్రీస్తును సంతోషంగా స్మరించుకునే, ప్రజలందరిలో క్షమాగుణం, ఐక్యత, ప్రేమ, దయ, కరుణ, దాతృత్వాన్ని వ్యాప్తి చేసే సమయమని గవర్నర్ పేర్కొన్నారు. శాంతిదూత ఏసుక్రీస్తు జన్మదినం సందర్భంగా జరుపుకొనే క్రిస్మస్ పర్వదినం మనందరి జీవితాల్లో కొత్త వెలుగు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. పాస్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. క్రైస్తవ ధర్మాన్ని విశ్వసించేవారందరికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హృదపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దయా గుణాన్ని ఇతరులకు పంచడమే ఏసుక్రీస్తు సందేశమని మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ