
తిరుమల, 25 డిసెంబర్ (హి.స.) :తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ పెరిగింది. క్రిస్మస్ సెలవులతో పాటు 30 నుంచి పది రోజుల పాటు వైకుంఠద్వార దర్శనాల రద్దీ ఉంటుందనే ఉద్దేశంతో...ముందస్తుగా దర్శనం చేసుకోవాలని జనం తిరుమల వస్తున్నారు. మాడవీధులు, అఖిలాండం, లడ్డూ కేంద్రం, అన్నప్రసాద భవనం, వసతి సముదాయాలు, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాలు కిటకిటలాడుతూ కనిపించాయి. వైకుంఠం క్యూకాంప్లెక్స్2లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం సర్కిల్ వరకు వ్యాపించింది. దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. అలిపిరిలోనూ వాహనాల రద్దీ అధికంగా కనిపించింది. చెక్‌పాయింట్ నుంచి గరుడ సర్కిల్ వరకు వాహనాలు గంటల కొద్దీ నిలిచిపోయాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ