
అమరావతి, 25 డిసెంబర్ (హి.స.)
అమరావతి,):కర్ణాటకలో ఇవాళ(గురువారం) ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొన్నడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో 17 మంది సజీవదహనమయ్యారు. ఈ ఘటనలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, లారీ పూర్తిగా దగ్ధమయ్యాయి. ట్రావెల్స్ బస్సు బెంగళూరు నుంచి శివమొగ్గ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్, అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ