అమెజాన్ వెబ్ సర్వీసులు డౌన్.. డౌన్ డిటెక్టర్లో 4 వేలకు పైగా రిపోర్టులు
హైదరాబాద్, 25 డిసెంబర్ (హి.స.) క్రిస్మస్ పర్వదినం వేళ అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS)లో ఏర్పడిన పెద్ద ఆటంకం వల్ల అనేక ఆన్లైన్ గేమింగ్ సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఫోర్ట్నట్, రాకెట్ లీగ్, ARC రైడర్స్, ఫాల్ గైస్ వంటి ఎపిక్ గేమ్స్ టైటిల్స్తో పాటు
అమెజాన్ వెబ్


హైదరాబాద్, 25 డిసెంబర్ (హి.స.)

క్రిస్మస్ పర్వదినం వేళ అమెజాన్ వెబ్

సర్వీసెస్ (AWS)లో ఏర్పడిన పెద్ద ఆటంకం వల్ల అనేక ఆన్లైన్ గేమింగ్ సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఫోర్ట్నట్, రాకెట్ లీగ్, ARC రైడర్స్, ఫాల్ గైస్ వంటి ఎపిక్ గేమ్స్ టైటిల్స్తో పాటు ఇతర ఆటలు కూడా లాగిన్ సమస్యలు, మ్యాచ్మేకింగ్ లోపాలు, సర్వర్ కనెక్షన్ ఎర్రర్లను ఎదుర్కొంటున్నాయి. డౌన్ డిటెక్టర్ ప్రకారం అమెరికాలో AWSకి సంబంధించి 4,000 మందికి పైగా యూజర్లు కంప్లయింట్ను రైజ్ చేశారు. ARC రైడర్స్ గేమ్కు మాత్రం దాదాపు 35 వేలకు పైగా రిపోర్టులు వచ్చాయి.

కాగా, వెబ్ సర్వీస్ డౌన్ అవ్వడం వల్ల ఫోర్ట్నట్లో లాగిన్ ఫెయిల్యూర్స్, సర్వర్స్ నాట్ రెస్పాండింగ్ ఎర్రర్లు, ఎపిక్ గేమ్స్ స్టోర్లో కొనుగోళ్ల సమస్యలు తలెత్తాయి. ఇక రాకెట్ లీగ్ లో ఎపిక్ ఆన్లైన్ సర్వీసెస్ (EOS) టైమ్లవుట్ల వల్ల మ్యాచ్లలో యూజర్లు చేరలేకపోయారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande