అమరావతిలో వాయిపేయి శత జయంతి ఉత్సవాలు: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
అమరావతి, 25 డిసెంబర్ (హి.స.) చరిత్ర తిరగరాసిన వారిలో వాజ్‌పేయి(Vajpayee) ఒకరని సీఎం చంద్రబాబు(Cm Chandrababu) కొనియాడారు. బీజేపీ నేతలతో కలిసి అమరావతి(Amaravati)లో 14 అడుగుల వాజ్‌పేయి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో స
చంద్రబాబు


అమరావతి, 25 డిసెంబర్ (హి.స.)

చరిత్ర తిరగరాసిన వారిలో వాజ్‌పేయి(Vajpayee) ఒకరని సీఎం చంద్రబాబు(Cm Chandrababu) కొనియాడారు. బీజేపీ నేతలతో కలిసి అమరావతి(Amaravati)లో 14 అడుగుల వాజ్‌పేయి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఎన్టీఆర్‌కు, వాజ్ పేయికి చాలా సన్నిహిత్యం ఉండేదన్నారు. లోక్‌సభకు పదిసార్లు, రాజ్యసభకు రెండుసార్లు ఎన్నికైన వ్యక్తి వాజ్‌పేయి అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 26 జిల్లాల్లో వాజ్‌పేయి విగ్రహాలు ఏర్పాటు చేశామన్నారు. వాజ్‌పేయి ఘన కీర్తిని తెలియజేసేందుకు స్మృతివనం నిర్మిస్తామని తెలిపారు. అమరావతిలో వాయిపేయి శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం సంతోషకరమన్నారు. వాజ్ పేయి గొప్ప మానవతావాది అని, మంచి కవి అని చెప్పారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలో నెంబర్‌వన్ అవుతుందని చెప్పారు. దేశానికి ఆ స్థాయికి తీసుకెళ్తే శక్తి, సామర్థ్యం ప్రధాని మోడీకి ఉందన్నారు. ప్రధాని మోడీ దేశం గురించి ఆలోచిస్తున్నారని, తాను తెలుగువారి కోసం ఆలోచిస్తున్నానని పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి శరవేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. అమరావతి అభివృద్ధి క్వాంటం వ్యాలీతో ప్రారంభవుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande